గొప్ప సంఘసంస్కర్త
జ్యోతిరావు పూలే – మేడి హరికృష్ణ

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా
జిల్లా యువజన సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ ఫూలే చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనీకుడన్నారు.

సామాజిక కార్యకర్తగా సంఘసంస్కర్తగా వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికులు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు యాదయ్య, మరియు ఉపాధ్యాయులు ఆనంద్ ,రాజు, సూర్య ప్రకాష్, నీరజ, అరుణ, తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page