రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

Spread the love

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్‌

రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం
కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని చెప్పారు. చెరకు కొనుగోలు ధర పెంపుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కాగా, 2024-25 సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పీని (చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర) క్వింటాల్‌కు రూ.25 పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్‌కు ఎఫ్‌ఆర్‌పీ రూ.340కి చేరింది. 2023-24తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ఈ సవరించిన ధర 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుందిళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్‌

రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందని చెప్పారు. చెరకు కొనుగోలు ధర పెంపుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా, 2024-25 సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పీని (చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర) క్వింటాల్‌కు రూ.25 పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్‌కు ఎఫ్‌ఆర్‌పీ రూ.340కి చేరింది. 2023-24తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ఈ సవరించిన ధర 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది

Related Posts

You cannot copy content of this page