సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

The goal is to solve problems: MLA KP Vivekanand

సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దూలపల్లి అయ్యప్ప కాలనీలో నెలకొన్న సమస్యలు, కొంపల్లి అపర్ణ నుండి దూలపల్లి కల్వర్టు వరకు డ్రైనేజీ అభివృద్ధి వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఆయా సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సన్న కవిత శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, సతీష్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page