తొలిమెట్టు కార్యక్రమ లక్ష్య సాధనకు కార్యాచరణ చేయాలి

Spread the love

The first step is to take action to achieve the objectives of the program

తొలిమెట్టు కార్యక్రమ లక్ష్య సాధనకు కార్యాచరణ చేయాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తొలిమెట్టు కార్యక్రమ లక్ష్య సాధనకు కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలిమెట్టు కార్యక్రమ లక్ష్య సాధనలో వెనుకబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, సెక్టార్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తొలిమెట్టు కార్యక్రమ అమలుపై గత నెలాఖరుకు సాధించాల్సిన ప్రగతి లక్ష్యం నిర్ధారించి, లక్ష్య సాధనకు చర్యలకై ఆదేశించనైనదని తెలిపారు. నవంబర్ మాసాంతానికి లక్ష్య సాధన చేయకపోవడంపై పటిష్ట కార్యాచరణ చేపట్టి, ఈ నెల 20 లోగా వందకు వంద శాతం అందరూ విద్యార్థులు ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

జిల్లాలో 1 నుండి 5 వ తరగతికి 43,145 మంది విద్యార్థులు ఉండగా, నిర్ధేశిత గడువు తర్వాత, ఈ నెల 21న విద్యార్థులకు పరీక్ష నిర్వహించినట్లు, ఇందులో ఇంకనూ 5,654 మంది విద్యార్థులు లక్ష్యం మేరకు కనీస విద్యా ప్రమాణాలు అందుకోలేక పోయారన్నారు. ఇంకనూ వెనుకబడ్డ విద్యార్థుల విషయంలో ఒక్కో విద్యార్థికి సంబంధించి, ఆయా విద్యార్థి ఏ సబ్జెక్టు లో వెనుకబడి ఉన్నది, సూక్ష్మంగా పరిశీలించి, విద్యార్థి వారిగా ప్రగతికి కార్యాచరణ రూపొందించి, వెంటనే అమలుచేయాలన్నారు.

మండల విద్యాధికారులు వారి వారి పరిధిలో పాఠశాలలు సందర్శించి, విద్యార్థుల అభ్యాసన, ఉపాధ్యాయుల బోధన, తీసుకొనే చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. వెనుకబడ్డ పాఠశాలల రెగ్యులర్ విజిట్స్ చేసి, వారంలోపల కనీస విద్యా ప్రమాణాలు ప్రతి ఒక్క విద్యార్థి సాధించేలా మండల విద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి లక్ష్య సాధన త్వరలో నిర్ధారించి తెలుపుతామన్నారు.

సమీక్షలో లక్ష్య సాధనలో వెనుకబడ్డ పాఠశాల వారిగా ఎంత మంది పిల్లలు, ఏ ఏ సబ్జెక్టుల్లో సాధనలో వెనుకబడ్డది, కారణాలు, సాధనకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాధికారి ఇ.ఎస్.ఎస్. శర్మ, ఏఎంఓ రవికుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, డిసిఎంఓ రాజశేఖర్, జెండర్ కోఆర్డినేటర్ ఉదయశ్రీ, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page