ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ లలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణ చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించవద్దని, విద్యార్ధులతోపాటు, సిబ్బందిని ప్రిస్కింగ్ చేపట్టి, తనిఖీ తర్వాతనే అనుమతించాలని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రం ప్రహారీ గోడ చుట్టూ భద్రతా సిబ్బంది పహారా కాయాలని, అప్రమత్తంగా వుంటూ, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.