The development will be undertaken in eight divisions of the twin circles of Quthbullapur
కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లలోని ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…
సాక్షిత : ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు నిధులకు కొరత లేదు : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే ప్రతిపాదించిన సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు గాను రూ.17 కోట్ల నిధుల మంజూరుకై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని, గాజులరామారం సర్కిల్ లో రూ. 8 కోట్లతో చేపడుతున్న పార్కుల అభివృద్ధి మరియు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, స్మశానవాటికలు, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, అలాగే UMCC ఆసుపత్రి ఎదురుగా వున్నటువంటి కుంటను శుద్ది చేసి సుందరీకరించాలని అధికారులకు సూచించారు.
అలాగే కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ప్రతీ బస్తీ, కాలనీల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపట్టవలసిన మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేయాలనీ, ఎస్.అర్.నాయక్ నగర్లో చేపడుతున్న ఇండోర్ శటిల్ కోర్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమై నియోజకవర్గ అభిృద్ధికి అవసరమయ్యే నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
ఈ సమావేశంలో జంట సర్కిల్ల ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, డిఈఈలు రూపాదేవి, శిరీష, పాపమ్మ, భానుచందర్, ఏఈలు కళ్యాణ్, సతీష్, సంపత్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.