తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

Spread the love

The Dalit Bandhu Scheme was introduced ambitiously by the Telangana State Government

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజనబస్తీ కాలనీ కి చెందిన కొండకల ప్రభు కి మంజూరైన ఎర్టీగా కారు ను లబ్దిదారుడికి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని , ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడు అని ,దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం

అమలు లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మన శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలు లో భాగంగా 100 మంది లబ్ధిదారులతో దళిత బంధు పథకం మార్గదర్శకాలు మరియు విధి విధానాల పై అవగహన కార్యక్రమం గతంలో నిర్వహించడం జరిగినది అని , ఎంపికైన లబ్ధిదారుడుకి మంజూరైన ఎర్టీగా కారు ను లబ్ధిదారుడికి అందించడం

చాలా సంతోషకరమైన విషయం అని,లబ్ధిదారులను శాలవ తో సత్కరించడం జరిగినది , వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక ,సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపినవారు అవుతామని,

వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుంది అని , దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని , ఈ 100 మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండలని, పక్క ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని ,ఈ పథకం ను సద్వినియోగ పర్చుకోవలని, లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించే విధంగా సహకరించాలని కొరినారు. అదేవిధంగా వ్యాపార యూనిట్లను వివరించామని ,వారికి నచ్చిన యూనిట్లు నెలకొల్పి ఆర్థిక ,సామాజిక సాధికారికత సాధించాలని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

పూర్తి స్థాయిలో పథకం అమలు పర్చేవిధంగా పథకం అమలు కార్యచరణ, పర్యవేక్షణ ఉండేలా చూడలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు లో లబ్ధిదారులకు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది అని అధికారుల సహకారం తో ముందుకు వెళ్లాలని, అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటారని ,దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద కారు పొందిన లబ్ధిదారుడు మాట్లాడుతూ దినసరి కూలి నుండి కారు ఓనర్ గా మార్చిన సంధర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి ,ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు భగవాన్, బ్రిక్ శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, ఎల్లం నాయుడు, రఘునాథ్, అనిల్, మోజేశ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page