మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Spread the love

అమరావతి:
కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా..

పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పిటిషనర్ ఇంటిని కూల్చివేసి వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటికి రోడ్డు వేశారంటూ పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారించారు.

అధికారులు తప్పు చేసారని నిర్ధారణ కావడంతో నెల రోజులు జైలు శిక్ష‌తో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది

Related Posts

You cannot copy content of this page