ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత

Spread the love

27వ డివిజన్ స్థానికుల లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష

తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు బుధవారం ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు నగర మేయర్ డాక్టర్ డాక్టర్ అందజేశారు.

27వ డివిజన్ పరిధిలోని కొత్త పింఛన్లు మంజూరు అయిన వాటిని మేయర్ శిరీష లబ్ధిదారులకి పింఛన్లు పంపిణీ చేశారు.

మేయర్ మాట్లాడుతూ వై.యస్.ఆర్. పింఛన్లు ఉదయం 5 గంటల నుండి ఇంటి దగ్గర వెళ్లి తలుపు తట్టి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

వైయస్సార్ పింఛన్ కానుక జనవరి ఒకటి నుంచి పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లే అందజేస్తున్నది. పింఛన్, రైస్ కార్డులు,ఆరోగ్య శ్రీ పథకాలు ఎంపికైన వారికి ప్రతి నెల మొదటి రోజే లబ్ధిదారుల గడప ముందుకొచ్చి ఠంచనుగా పింఛను అందిస్తున్నామని తెలియజేశారు. గతంలోలా చాంతాడంత క్యూలలో వృద్ధులు, దివ్యాంగులు నిలబడే అవస్థలు లేవని, ఆత్మ అభిమానం చంపుకోవాల్సిన పనిలేదని తెలిపారు. ఒకవేళ పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని, వారి దగ్గర ఉండి చెయ్యి పట్టుకుని నడిపించి పెన్షన్ అందే విధంగా సాయం చేస్తారని లబ్ధిదారులకి వివరించారు.


ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల అందాలని ఆయన సంకల్పం అని తెలియజేశారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో జూన్ 2020న, పాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు సీఎం గారు నాంది పలికారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని ప్రారంభించారు. పింఛన్లు దరఖాస్తులు స్వీకరణ, మంజూరు అనేది నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుందని ఈ సందర్భంగా మేయర్ తెలియజేశారు


27వ డివిజన్లో వృద్ధాప్యం పెన్షన్లు 126 మందికి, వితంతు పెన్షన్లు 90 మందికి, ఒంటరి మహిళ పెన్షన్లు ఏడు మందికి, వికలాంగుల పెన్షన్లు 21 మందికి, కిడ్నీ పేషంట్లకి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని. ఒక్క 27వ డివిజన్లోనే 245 మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష వారితో పాటు భరణి యాదవ్, గీతా యాదవ్,చింత రమేష్,డివిజన్ కార్యదర్శి గోపాల్, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page