SAKSHITHA NEWS


The chief minister is credited with supporting Mirchi farmers

సాక్షిత : వ్యవసాయాన్ని లాభసాటిగా మీర్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మునుగోడ్ ఉప ఎన్నికలలో భాగంగా నాంపల్లిలోని అంగడి బజార్ లో స్థానిక రైతులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో నష్టపోయారని, వ్యవసాయం అంటే దండగా అని భావించే వారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో పంట పెట్టుబడుల కోసం ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉంచడం, నూతన సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

అంతే కాకుండా రైతులు పండించిన ధాన్యం కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రైతు బంధు క్రింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఆయన చెప్పారు. అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే కేంద్రంలోని BJP ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై భారం మోపుతుందని వివరించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తో ఎరువులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పెట్టుబడులు కూడా రైతులపై ఆర్థిక భారం పడుతుందని ఆరోపించారు. రైతులకు చేయూత అందించి ఆదుకోకపోగా పెనుభారం మోపడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల లో ఓట్ల కోసం వచ్చే BJP, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. అన్ని రకాలుగా అండగా ఉంటూ మీ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కు మద్దతు తెలపాలని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


SAKSHITHA NEWS