వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి

Spread the love

పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విధిగా
విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో వుంటాయని అన్నారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని బహిరంగ మద్యం సేవించడం,అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిఘా వ్యవస్థకు ప్రధాన ఆయుధంగా మారిన సీసీ టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాలకు గురైన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు చాలా ముఖ్యమని వాటిని త్వరగా తెప్పించుకొని ప్రతి రోజు కేసులను లక్ష్యంగా పెట్టుకుని చేధించాలని సూచించారు. విచారణలో ఎస్సీ ఎస్టీ, పోక్సో & ఎన్ డి పి ఎస్ యాక్ట్ కేసులతో పాటు దీర్ఘకాలిక పెండింగ్‌ కేసులు, తీవ్రమైన కేసుల పురోగతిపై సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాద ఘటన ప్రాంతాలకు చేరుకొని, ప్రమాదాల గల కారణాలు విశ్లేషించి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానంగా ఖమ్మం రూరల్ ,కొణిజర్ల , వైరా ప్రాంతాలలో వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు చేయడం , వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించటంతో పాటు ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా వుండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ అన్నది ప్రతీ అధికారికి ప్రతీసారీ కొత్తగానే ఉంటుందని, సరికొత్త సవాళ్లు కూడా ఎదురవుతుంటాయని కాబట్టి ఎన్నికలకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే నిర్వహణ సులభతరంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా
క్రిటికల్ పోలింగ్కేంద్రాల గుర్తింపులో స్పష్టత, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన చెక్పోస్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి, క్షేత్రస్థాయిలో ఎంతమంది సిబ్బందిని విధుల్లో పెట్టాలి తదితర అంశాలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలని పెర్కొన్నారు. ఎన్నికల సంబంధిత పాత నేరాలు తదితర అంశాలపై పోలీస్ అధికారులకు అవగాహన వుండాలని అన్నారు.
సమావేశంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్,అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ట్రైనీ ఏఎస్పీ అవినాష్ కుమార్, ఏసిపీలు గణేష్ ,భస్వారెడ్డి, రహెమాన్, రామనుజం, ప్రసన్న కుమార్, రవి, శివరామయ్య, సాంబరాజు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఏ ఓ అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page