విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ
విజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని ఎస్ఐ సివిల్ డ్రెస్లో ఉండటం వల్ల అక్కడ ఉన్న ఆకతాయిలు గుర్తుపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జూద శిబిరాన్ని ఖాళీ చేయించామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ తెలిపారు. మరల జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.