
సికింద్రబాద్, : ఇటీవల గుండె పోటుకు చికిత్స పొంది కోలుకున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను మోండా మార్కెట్ లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు కలుసుకొని పరామర్శించారు. బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు, అధికారులు పద్మారావు గౌడ్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app