
మహబూబాబాద్ జిల్లా
రోడ్డు భద్రత నియమాలు పాటించడం మన అందరి బాధ్యత
రోడ్డు ప్రమాదాల వల్ల నష్టపోతున్న వారిలో ఎక్కువ శాతం యువతే
— ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నెహ్రు సెంటర్ మీదిగా అండర్ బ్రిడ్జి, మదర్ తెరెస్సా బొమ్మ, బస్ స్టాండ్ రోడ్డు, నర్సంపేట బైపాస్, వైస్సార్ బొమ్మ, మునిసిపల్ ఆఫస్ నుండి తిరిగి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS జెండా ఊపి ప్రారంభించి బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నందునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రతా వారోత్సవాల నుంచి మాసోత్సవాలుగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల కారణంగా నష్టపోతున్న వారిలో 60 నుంచి 70 శాతం యువతే ఉన్నారని చెప్పారు. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల కుటుంబానికి కలిగే నష్టాన్ని ఎవరు పూడ్చలేరని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. జిల్లాను యాక్సిడెంట్స్ ఫ్రీగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ డ్రైవింగ్ చేసి కష్టాల పాలవకుండా బాధ్యతగా ఉండాలన్నారు. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని, గుర్తు చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు భద్రతపై కొంత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్ కారణంగా జీవితాలను నాశనం చేసుకోకుండా, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి సహాయం చేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడిని సన్మానం చేసి హెల్మెట్ ను బహుకరించారు. నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ దేవేందర్, రూరల్ సీఐ సరవయ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బయ్యారం సీఐ రవి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,ఇన్స్పెక్టర్ శంకర్,ఇతర అధికారులు పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app