SAKSHITHA NEWS

ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి,

మైలవరం నియోజకవర్గంలో 5 గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) కింద రూ.4.97 లక్షలు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ సాయాన్ని ఎల్.ఓ.సిల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు కి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app