సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి

Spread the love

సీఎంఆర్ఎఫ్ తో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా..

పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్

ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితాలక్ష్మారెడ్డి

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి కి కుల్చారం కు చెందిన శ్రీమతి లునవత్ సునితా సిఫార్సు చేసుకోగా మంజూరైన ₹46,000=00 (నలభై ఆరు వేల రూపాయల చెక్కును) నేడు మాజీ జెడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి కి మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉండి అతి కష్టం మీద వైద్యం చేయించుకున్న మరియు చేయించుకుంటున్న వారికి ఆర్ధిక సహాయంతో భరోసా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన మంచి సదవకాశమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నారని, అత్యవసర సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని సీఎంఆర్ఎఫ్ ను కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు…….ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ని ప్రజా ప్రతినిధులు బారస పార్టీ సీనియర్ నాయకులు,యువ నాయకులు పాల్గొన్నారు ……

Related Posts

You cannot copy content of this page