తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం

Spread the love

Telangana State Government Bathukamma Day

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో డీసీ వెంకన్న , కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి కేటీఆర్ కి నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.


అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోని మహిళలు ముఖ్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం  ఉచితం గా చీరల పంపిణి చేయడం జరిగింది అని ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ  యొక్క చీరల పంపిణీకి  నియోజక వర్గం లో  పేద మహిళలకు అందించడం చాలా ఆనందం గా ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు బతుకమ్మ పండుగా ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి  చూపిన ఘనత మన ప్రభుత్వం కే దక్కిందని  అని తెలియచేసారు.

అదేవిధంగా దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింది అని బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు.. బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నది . ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో AMOH నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు బలరాం యాదవ్ ,జంగం గౌడ్,తిరుపతి రెడ్డి, గణపతి, రవిశంకర్, బస్వరాజు,యాదగిరి గౌడ్, రూప రెడ్డి మరియు లబ్ధిదారులు
తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page