స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రెస్ మీట్

Spread the love

Telangana Rakshasan Samiti party press meet at local press club

స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రెస్ మీట్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రెస్ మీట్ కు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. మన నీళ్లు మన నిధులు నియామకాల తో ఏర్పడిన తెలంగాణ మనకు కావాలి. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాల ప్రజలకు మేలు జరగాలి. 25 సంవత్సరాల సుదీర్ఘకాలం అధికారంలోకి వచ్చిన రాకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతాం.

నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేస్తాం, నూతన ఆరోగ్య రక్ష విధానాన్ని ప్రవేశపెడతాం. అన్ని కులవృత్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఇంటికొక ఉద్యోగం ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెలంగాణ విద్యాసంస్థలను కాపాడుతాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు సంక్షేమ ఫలాలను ఇంటికే అందజేస్తాం.

ఎస్సీ బందు, ఎస్టీ బందు ,బీసీ బందు, మైనారిటీ సంక్షేమ నిధి, అగ్రవర్ణ పేదల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమకారులను కాపాడుకుంటాం. 1300 మంది అమరులైన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున అందజేస్తాం.

వారికి పార్టీ టికెట్లు కేటాయిస్తాం. సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ రక్షణ సమితి ప్రధాన ధ్యేయం అని నరాల సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక సభ్యులు బుర్ర సోమేశ్వర్ గౌడ్, ఆలస్యం విరన్, ఇటుకుల మాధవి, పూజల లక్ష్మి, దుర్గ, కుసుమ, నాగమణి, పూణెం సీతక్క, బుచ్చలాతేజ తదితరులు పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,

Related Posts

You cannot copy content of this page