Telangana is a model for the country in the implementation of welfare schemes
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం…
దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు అందుతున్న బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు…
రూ.3.20 కోట్ల విలువ చేసే కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను 320 మందికి పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్
…
సాక్షిత : పేదల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని 299 మంది, బాచుపల్లి మండల పరిధిలోని 21 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ.3,20,37,120/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. స్వరాష్ట్రం సాధించిన నాటి నుండి ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.