SAKSHITHA NEWS

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కోడలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.71 లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామం

గ్రామీణ అభివృద్ధికి రూ.2.68 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.98 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం

ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది

వైసీపీ పాలనలో రాష్ట్రానికి అప్పు పరపతిని(ఎఫ్.ఆర్.బీ.ఎం) జీరోకి చేర్చారు

గత ఐదేళ్లలో ఆర్థికంగా చితికిపోయిన ఏపీని అన్నివిధాల ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండటం ఆనందదాయకం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తమ ప్రసంగంలో ప్రస్తావించారు

దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం

రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం సంతరించుకునేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app