ఇచ్చిన మాటను నెరవేరుస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి

Spread the love

Sunkireddy Raghavender Reddy, chairman of the Unity Foundation, is fulfilling his promise

ఇచ్చిన మాటను నెరవేరుస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి


సాక్షిత ప్రతినిధి.
ఆమనగల్ పట్టణంలో పూసల సంఘం సభ్యుల కోరిక మేరకు గత నెలలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల హామీ ఇవ్వడం జరిగింది


ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతలుగా రెండు లక్షల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది.
మానవతా హృదయంతో వారు సమకూర్చిన విరాళంతో ఈరోజు స్లాబ్ నిర్మాణాన్ని వేయడం జరుగుతుందని పూసల సంఘం నాయకులు తెలిపారు.


ఈ సందర్భంగా అడిగిన వెంటనే కాదనకుండా మా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించిన *ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మా పూసల సంఘం కులస్తులందరం ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటామని తెలుపుతూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పూసల సంఘం నాయకులు వెంకటేష్ పరమేష్ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు గన్నోజు సత్యం, రచ్చ శ్రీరాములు, చంద్రశేఖర్ శ్రీనివాసరెడ్డి, ఆప్కారి వెంకటేష్ జంతుక రాజు, కొండల్, రమేష్ ,జగన్, మల్లయ్య తిరుపతి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page