Sunkireddy Raghavender Reddy, chairman of the Unity Foundation, who started the cricket competitions
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి. యువత అన్ని రంగాల్లో రాణించాలి. యువతకు అండగా ఉంటా. నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తి పట్టణం మినీ స్టేడియంలో శ్రీ రామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.
యువతను ప్రోత్సహిస్తూ క్రికెట్ ఆడుతూ అలరించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో దాదాపుగా 60 జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శరీరధారుడ్యం మానసిక ఆరోగ్యం పెంపొందిస్తాయన్నారు.
పోటీ తత్వంతో ప్రతిభ కనబర్చేందుకు క్రీడాకారులు ప్రయత్నించాలని తద్వారా విజయం సమ కూరుతుందని,మారుమూల పల్లెల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెతికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు.