క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:కంభం ఎస్సై

Spread the love

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:కంభం ఎస్సై

ప్రస్తుతం నేటి నుండి ఐపిఎల్ క్రికెట్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఐపిఎల్ సందర్భంగా పలువురు బెట్టింగ్ రాజాలు బెట్టింగ్ నిర్వహిస్తారని ముందస్తుగా ప్రకాశం జిల్లా కంభం మండల ఎస్సై పులి రాజేష్ స్పందించారు.ఈ సందర్భంగా ఎస్సై పులి రాజేష్ మాట్లాడుతూ గతంలో బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన వారెవరైనా ఉంటే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.అదేకాక బెట్టింగ్ నిర్వహిస్తారని అనుమానిత ప్రాంతాలలో కూడా పోలీస్ నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.అలానే యువత క్రికెట్ బెట్టింగ్ మాయలో పడవద్దని కోరారు.బెట్టింగ్ కూడా అత్యంత ప్రమాదకర జూదం లాంటిదని, ఇలాంటి బెట్టింగ్లు చేసినా, ప్రేరేపించినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని అన్నారు. వినోదం కొరకు ఆడే ఆటను వినోదముగానే చూడాలనీ, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Related Posts

You cannot copy content of this page