SAKSHITHA NEWS

Steps should be taken towards implementation of constitutional spirit.

రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి.
-అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

73వ రాజ్యాంగ దినోత్సవమును పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను అధికారులు, సిబ్బందితో చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని అన్నారు. ప్రస్తుతం మన రాజ్యాంగంలో 413 ఆర్టికల్స్, 13 షెడ్యులు ఉన్నాయని అన్నారు.

బ్రీటీష్ వారు 200 కు పైగా సంవత్సరాలు మనల్ని పాలించిన తరువాత మనకు స్వాతంత్ర్యం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటి ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు చర్చించి 1949 నవంబర్ 26న తుది రాజ్యాంగం ఆమోదించబడిందని తెలిపారు.

2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నామని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని, రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందిందని తెలిపారు.

రాజ్యాంగం యొక్క ఉపోద్గాతన్ని ఆన్ లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు చదివే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. http://readpreamble.nic.in


అనే వెబ్ సైట్ లో 22 భారతీయ అధికారిక భాషలలో, ఆంగ్లంలో రాజ్యంగ ఉపోద్గాతం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మదన్ గోపాల్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS