State Transport Minister Puvvada Ajay Kumar inaugurated the Dubbaka bus stand
దుబ్బాక బస్ స్టాండ్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గత ఉప ఎన్నికల హామీ మేరకు శిథిలావస్థలో ఉన్న బస్టాండ్‌ను తొలిగించి, రూ.3.50కోట్లతో సర్వాంగ సుందరంగా మోడల్ బస్టాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.
ఆధునిక ఆర్టీసీ బస్ స్టాండ్ ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం దుబ్బాక నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శ్రీకారం చుట్టారు.