శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2022

Spread the love

Srivari Salakatla Brahmotsavam 2022

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు: బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు. దర్శనంతోనే యశోప్రాప్తి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై శుక్ర‌వారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు క‌నువిందు చేశారు.

సర్వభూపాల వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.దర్శనంతోనే య‌శోప్రాప్తి. ఓం నమో వెంకటేశాయ

Related Posts

You cannot copy content of this page