SAKSHITHA NEWS

Srikakulam district SP G. Radhika press meet on the murder of prominent politician Ramaseshu

image 36

ప్రముఖ రాజకీయ నాయకు
రామశేషు హత్య పై
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. రాధిక ప్రెస్ మీట్

యాంకర్ :శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఇటీవల జరిగిన హత్య కేసును పట్టణ డిఎస్పీ మహేంద్ర మాత ఆధ్వర్యంలో వారి టీమ్ చాకక్యంగా చేదించారు.ఈ హత్యను
ఆధిపత్య పోరు వ్యక్తిగత కక్షలే కారణంగా చేసినట్లుగా, సిసి ఫుటేజ్, సిడిఆర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కేసు చేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జి.రాధిక అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు యొక్క పూర్వపరాలును రాధిక మీడియాకు తెలిపారు.

వాయిస్ : శ్రీకాకుళం DSP మహేంద్ర పర్యవేక్షణలో వివిధ బృందాలు గాలించి త్వరితగతిన దర్యాప్తు చేయగా అదే గ్రామమునకు చెందిన తలకోల సుధాకర్ రెడ్డి, అతని కుమారుడు రవీందర్ రెడ్డి లు గ్రామం నుండి అకస్మాత్తుగా పరారైనట్లు తెలియగా, వారిపైన నిఘా పెంచారు.

గ్రామంలో సుధాకర్ రెడ్డికి చెందిన షెడ్లో ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు సుమారు రెండు నెలల నుండి ఉండేవారని వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేయగా 17వతేదీ శనివారం నాడు తలకోల సుధాకర్ రెడ్డి, అతని కొడుకు రవీందర్ రెడ్డిలు ఆముదాలవలస రైల్వే స్టేషన్ నుండి పరార్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారరని తెలుసుకున్న శ్రీకాకుళం సిఐ సన్యాసినాయుడు, అతని సిబ్బంది వారిని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.బరాటం రామశేషును హత్య చేసిన నలుగురిని మీడియా ముందు ప్రవేశపెట్టి అదేవిధంగా ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ రాధిక అభినందించారు.


SAKSHITHA NEWS