శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన రహదారి మరమత్తులకు శంకుస్థాపన

Spread the love

శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన రహదారి మరమత్తులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

హనుమకొండ జిల్లా..

హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ లోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సమేత సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రధాన రహదారి కృంగటంతో రోడ్డు మరమ్మతుల గురించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అనంతరం ప్రధాన ఆలయంలో ప్రవేశించి అభిషేక కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు ..

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించి ఆశీర్వచనం చేయడం జరిగింది. తదనంతరం ఈవో కార్యాలయంలో గుడి ప్రణాళిక మ్యాప్ పరిశీలించి సూచనలు సలహాలు చేసి ఆలయ పరిసర ప్రాంతాలను మరియు నిత్య అన్నదాన సత్రాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నిమ్మాని శేఖర్ రావు, కాజీపేట మండల నాయకలు, డివిజన్ నాయకులు, కార్యకర్తల తో మాజీ ఆలయ కమిటీ ఛైర్మన్ మరియు ఈవో, ఆలయ అర్చకుల తో పాటు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page