అంతరిక్షంలోకి స్పీడెక్స్ డాకింగ్, ప్రయోగం!
ఇస్రో చరిత్రలో మరో ఘనత
హైదరాబాద్:
గత కొన్నేళ్లుగా అంతరి క్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది.
గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయో గానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో.. ట్విటర్‌లో వెల్లడించింది.
ఇక అంతరిక్షంలో శాటిలైట్ల ను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా.. ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా..
అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది.
భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌లో విజయ వంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్‌కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.