SAKSHITHA NEWS

వ్యవసాయ రంగంపై యువత ద్రుష్టి సారించాలి : రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. రైతు సంక్షేమం కోసం నిరంతం పాటు పడ్తుందన్నారు రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో మార్పులు చేర్పులు జరగాలి. యువత వ్యవసాయంపై ద్రుష్టి సారించాలి. శాస్త్ర సాంకేతికతను వ్యవసాయ సాగులో జోడించాల్సిన అవసరం ఉందన్నారు భవానీ రెడ్డి. మూసధోరణిలో సాగు చేయడం మానేసి వినూత్న పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. తగ్గువ పెట్టుబడి, తగ్గువ విస్తీర్ణంలో అధిక దిగుబడి వచ్చే పంటలు వేసి లాభపడాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఇలాంటి పద్ధతులు యువత సాగుపై ద్రుష్టి సారించినప్పుడే సాధ్యమౌతుందన్నారు. విదేశాల్లో ఐటీ కంపెనీల్లో లక్షల్లో జీతాలు తీసుకునే వారుసైతం వ్యవసాయంపై ఫోకస్ చేస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

యువత వ్యవసాయంపై మక్కువ పెంచుకుంటే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ యువ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత నివ్వడానికి సిద్ధంగా వుంది. యువ రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయడానికి సైతం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఎల్లవేళలా సిద్ధం అని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న యువతకు వ్యవసాయ రంగంలో మెళుకువలు, సాగుపై అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ, కమిషన్ సపోర్ట్ చేస్తుందన్నారు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి.