SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 24 at 1.31.57 PM

మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ప్రారంభం,వృద్ధాశ్రమంలో అన్నదాన,హరితహార కార్యక్రమలలో పాల్గొన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు

మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని తుల్జాభవాని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్లు నాటారు, అనంతరం ఇస్నాపూర్ చౌరస్తాలో అభిమానులు, బి ఆర్ఎస్ కార్యకర్తల, ప్రజల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు, అనంతరం ఇస్నాపూర్ గ్రామంలో దివ్యాంగుల జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించి ఇద్దరు దివ్యాంగులకు జీవనోపాధి కి ఉపయోగపడేలా రెండు కుట్టు మిషన్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అందజేశారు,రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద వికలాంగులకు 4,016 రూపాయిలు పెంచిన సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగులు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్,ఇంద్రేశం గ్రామ శివారులో మదర్ తెరెసా వృద్ధాశ్రమం లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కోసి సంబరాలు నిర్వహించారు,అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు,హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడి అందించే పరిశ్రమలు తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర కీలకమని ఆయన తెలిపారు,అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు మరోపక్క రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత అని అన్నారు ఇలాంటి నాయకుడికి పది కాలాలపాటు చల్లగా ఉండాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వచనం అందజేయాలన్నారు.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతంగా నిలపడం లో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి మర్చిపోలేమని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో ప్రజలు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు,NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS