Special measures for the development of Serilingampally division..
శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోగల గోపినగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం నూతనంగా వేస్తున్న సిసి రోడ్డుకు ఇరువైపులా ర్యాంపులను, అరుగులను తొలగించి స్థానిక కాలనీవాసుల సౌలభ్యం కొరకు రోడ్డు వెడల్పుగా ఉండుటకై ర్యాంపులను, అరుగులను తొలగించడం జరిగినది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు ప్రాధాన్యత క్రమంలో కాలనీలో వారిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిసి రోడ్ పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కలివేముల వీరేశం గౌడ్, నరసింహ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, రాజ్ కుమార్, దివాకర్ రెడ్డి, గాఫర్, శ్రీనివాస్, మల్లేష్, గౌతమ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శేఖర్, సాయి, శ్యామ్, కిరణ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు