భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి

Spread the love

మంత్రి జగదీశ్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన పంతంగి వీరస్వామి గౌడ్


సాక్షిత : దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనం కోసం స్థలం కేటాయించడంతోపాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. రాత్రి జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ,ఐటీ హబ్, మోడల్ మార్కెట్ నిర్మాణంతోపాటు జిల్లా కార్యాలయాలు నిర్మాణం కావడంతో రియల్ ఎస్టేట్ రంగం సైతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అన్ని కుల సంఘాలకు భవనాలకు స్థలం కేటాయించినట్లుగానే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు స్థలం కేటాయించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, సభ్యులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ , అయితగాని మల్లయ్య గౌడ్ బానోతు జానీ నాయక్,ఆకుల మారయ్య,రాపర్తి సురేష్ గౌడ్, తదితులున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page