ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

Spread the love

ఎర్రుపాలెం – చెరువుమాధవరం మధ్య మూడవ లైన్ ను విద్యుదీకరణతో పాటు పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా-
దక్షిణ మధ్య రైల్వే , ఎర్రుపాలెం – చెరువుమాధవరం రైల్వే స్టేషన్ల మధ్య 16.6 కిలోమీటర్ల పొడవునా విద్యుద్దీకరణతో పాటు మూడవ లైన్ను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ విభాగం గ్రాండ్ ట్రంక్ రూట్లోని ముఖ్యమైన మూడవ లైన్ ప్రాజెక్ట్ విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ & విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేయబడింది . విజయవాడ – కాజీపేట మధ్య విభాగం దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర భాగాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గం వెంట ఉన్న అత్యంత కీలకమైన రైలు మార్గం.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ – కాజీపేట విభాగం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి వుంది . ఇది అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి మరియు అన్ని దిశల నుండి దేశంలోని తూర్పు భాగాలు మరియు దక్షిణ ప్రాంతాల వైపు నిరంతరము ప్రయాణీకుల మరియు సరుకు రవాణాకు సాక్షిగా నిలుస్తుంది . ఈ కీలక మరియు అధిక రద్దీ విభాగంలో రద్దీని తగ్గించడానికి, విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్ & విద్యుదీకరణ ప్రాజెక్ట్ 219 కి.మీ (ఆంధ్రప్రదేశ్ – 35 కి.మీ. & తెలంగాణ – 184 కి.మీ) దూరం మేర పనులు చేపట్టేందుకు రూ. 1,952 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయబడింది. విజయవాడ న్యూ వెస్ట్ క్యాబిన్ – చెరువుమాధవరం క్యాబిన్ మధ్య 16.7 కిలోమీటర్ల దూరం విద్యుదీకరణతో పాటు సెక్షన్ సెప్టెంబర్, 2022లో పూర్తి చేసి ప్రారంభించబడింది.

ఇప్పుడు ఎర్రుపాలెం-చెరువుమాధవరం మధ్య 16.6 కిలోమీటర్ల మేర మూడో లైను విద్యుదీకరణతో పాటు ప్రారంభమైంది. ఈ 16.6 కి.మీల విస్తీర్ణంలో 5.5 కి.మీలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి మరియు మిగిలినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. వీటిమధ్య విస్తరించి వున్నా మార్గంలో మూడో లైన్ను ప్రారంభించడం వల్ల సరుకు రవాణా మరియు ప్యాసింజర్ రైళ్లకు రద్దీ తగ్గుతుంది.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ .. చెరువుమాధవరం – ఎర్రుపాలెం మధ్య ట్రిపుల్ లైన్ పనులను విద్యుద్దీకరణతో పాటు విజయవంతంగా ప్రారంభించినందుకు విజయవాడ డివిజన్ మరియు నిర్మాణ సంస్థ యొక్క మొత్తం సిబ్బందిని అయన అభినందించారు. కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం వల్ల ఈ అధిక రాకపోకలు సాగించే ఈ మార్గంలో రద్దీ తగ్గడంతో పాటు అధిక సంఖ్యలో రైళ్లను సమర్థవంతంగా నిర్వహించడం సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల పనుల పురోగతి వేగంగా మరియు సంతృప్తికరమైన స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page