ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.

Spread the love

ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.


*సాక్షిత * : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం తో పాటు అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తుంటే పట్టించుకోకుండా వ్యవహరించడాని నిరసిస్తూ నేడు ప్రజావాణి సందర్భంగా ప్రజావాణిలో ఇచ్చిన వినతిపత్రాలకు విలువలేదని ఆ వినతిపత్రాలను కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా దగ్ధం చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,కార్యవర్గ సభ్యులు హరినాథ్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, అన్ని చెరువులు కబ్జాకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో 2002 సంవత్సరం నుండి వినతిపత్రాలను ఇవ్వడమే కాకుండా,వందలాది మంది ప్రజలతో ధర్నా చెయ్యగా ఆ ధర్నాకు స్వయంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారని అప్పటి కలెక్టర్ హరీష్ వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించి వెంటనే కుల్చోవెయ్యలని ఆదేశించినా ప్రయోజనం లేదని,అనంతరం సీపీఐ పోరాటాలు,వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి మునిసిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వయంగా 3000 వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే కూల్చివేయ్యాల్సిందిగా ఆదేశాలు జరిచేసి 8 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం,కబ్జాలు మరింత పెరిగయే తప్ప తగ్గలేదని కాంగ్రెస్ హయాంలోనైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తే ఆది లేదని కావున ఇప్పటికైనా ఈ నిరసన ద్వారానైనా కండ్లు తెరిచి కబ్జాలను అరికట్టాలని కోరారు.


కేవలం దామెర్ చెరువు దగ్గర కూల్చివేస్తే అది రాజకీయ ప్రేరేపిత చర్యగానే భావించాల్సి వస్తుందని అన్నారు. రెవెన్యూ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రెవెన్యూ అధికారులు పొద్దున్న బోర్డులు పాతితే సాయంత్రం కల్లా కబ్జాదారులు వాటిని తొలగించి అక్రమించుకుంటున్నారని అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమి పట్టనట్లు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అదే పేద ప్రజలు గుడిసెలు వేస్తే వందలాది పోలీసులను పంపించి తొలగించే అధికారులు కబ్జాదారులను మాత్రం ఏమనకపోవడం దారుణమన్నారు. అలాంటి అధికారులు ప్రజలకు ఏమి చేస్తారని అధికారులు కబ్జాదారుల వైపే ఉన్నట్లు భావించాల్సి వస్తుందన్నారు.
ఒక్కో కబ్జాదారుడి పై పదుల కేసులు ఉన్న వారు దర్జాగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ,అధికారులతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడం వల్ల ప్రజలకు అధికారులపై,కార్యాలయాలకు రావలంటేనే చిదరించుకుంటున్నారని కావున అధికారులు నీతి నిజాయితీ నిరూపించుకోవలంటే కబ్జాలను అరికట్టి భూములను, చెరువులను కాపాడి కబ్జాదారులను కటకటాల్లోకి పంపాలని డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ప్రవీణ్, సహదేవరెడ్డి, మండల నాయకులు ఇమామ్, నర్సింహారెడ్డి,ప్రభాకర్,సామెల్,ఆశప్ప,సతీష్,రాజులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page