సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి

Spread the love

Social reformer, teacher and writer Savitribai Phule’s birth anniversary

సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళి అర్పించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి


సాక్షిత : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సేనేట్ హల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ జ్ఞాన సముపార్జన ద్వారానే మానవుడు ఉన్నత స్థితిని సాధిస్తాడు అనే సావిత్రిబాయి ఫూలే సూక్తి ద్వారా మనమంతా ప్రేరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం నిషిద్ధం అని చెబుతున్న రోజుల్లోనే తన భర్త ప్రోద్బలంతో సావిత్రిబాయి పాఠశాలలో చేరారు. విద్యార్థిగా ఉంటూ తన భర్త ఇచ్చిన నల్లజాతీయులు మానవహక్కుల పోరాటయోధుడు థామన్ క్లార్క్‌సన్ ఉద్యమ చరిత్ర”ను చదివి తద్వారా స్ఫూర్తి పొందిన ఆమె మానవహక్కుల పోరాటయోధురాలిగా మారారు. బాల్య వివాహాల నిర్మూలనకు కూడా కృషిచేశారని చెప్పారు. ఆమె సంఘ సంస్కర్తగా తన భర్త జ్యోతిభాపూలే మరణించిన సమయంలో తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారని చెప్పారు.

మహిళా సాధికారత కోసం ఏ ప్రభుత్వాలు చేయనంతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మహిళల ద్వారానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైవుతుందని నమ్మి నేడు జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న ఇళ్ల పట్టాలు, వంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను మహిళల పేరుతో వారి కుటుంబాలకు అందించడం జరుగుతుంది. ఆలాగే రాజ్యాంగ, రాజకీయ పదవులలో మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు.

Related Posts

You cannot copy content of this page