SAKSHITHA NEWS


SIPB green signal for total investments of Rs.23,985 crore including steel plant in Kadapa..!

కడపలో స్టీల్ ప్లాంట్‌ సహా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..!


సాక్షిత : ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం.

కడప జిల్లాలో రూ. 8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.

అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం.

మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.

1) కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడి.
మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి.
మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు. మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు.
త్వరలో పనులు ప్రారంభం.
వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్న సీఎం.

వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమన్న సీఎం.
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్న సీఎం.
ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న సీఎం.

జేఎస్‌ డబ్ల్యూ గ్రూప్ మొత్తంగా 22 బిలియన్ డాలర్ల కంపెనీ.
స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ రంగాల్లో ఉన్న కంపెనీ.
ఏడాదికి 27 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను సాధిస్తున్న కంపెనీ.
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీగఢ్, ఒడిశాల్లో జేఎస్‌ డబ్ల్యూ కి కర్మాగారాలు.

2) 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్.
2024 డిసెంబర్లో ప్రారంభించి… నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యం.
ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి.

3) రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం.
ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి.
ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటు.
వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.
ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు..


SAKSHITHA NEWS