పేదల ఆరోగ్య రక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత

Spread the love

CM YS Jagan has given high priority to the health care of the poor

పేదల ఆరోగ్య రక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత

ఆరోగ్యశ్రీ కింద 3225 వైద్య చికిత్సలు

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అనంతపురం,

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తమ స్వగృహంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విడుదలైన రూ.44 లక్షలు విలువజేయు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..

తమది ప్రజా ప్రభుత్వమని, నిత్యం పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. వైద్యం కోసం పేదవారు ఇబ్బందులు పడకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు. 2019 వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు 1059 మాత్రమే ఉండేవని, జగన్‌ సీఎం అయ్యాక వాటి సంఖ్య 2059కి పెంచారన్నారు

. తాజాగా వైద్య చికిత్సలను 3225కు చేశారని తెలిపారు.పేదలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్‌ కళాశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసి పేదవాడికి వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో కూడా చికిత్సలు అందిస్తున్నామన్నారు.

Related Posts

You cannot copy content of this page