నెల్లూరు జిల్లా:
తేది:02-04-2023
సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని సి.పి.ఆర్.కల్యాణ మండపంలో నిర్వహించిన వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పొదుపు మహిళా సంఘాల జయనీరాజనాలు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన పొదుపు సంఘాల మహిళలు.
కార్యక్రమంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ..
👉 రాష్ట్ర చరిత్రలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
👉జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు, 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలు బాకీ ఉన్న బ్యాంకు రుణాలను వై.యస్.ఆర్.ఆసరా ద్వారా 4 విడతలుగా నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు వై.యస్.ఆర్. ఆసరా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు 3విడతల్లో ఇప్పటి వరకు 19,178కోట్ల రూపాయలు మహిళలకు అందించారు.
👉 నెల్లూరు జిల్లాలోని 34,443 పొదుపు సంఘాలలోని 3,29,815 మంది మహిళలు 825.78 కోట్ల రూపాయలు వై.యస్.ఆర్.ఆసరా ద్వారా లబ్ది పొందారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలోనే వై.యస్.ఆర్.ఆసరా ద్వారా 3వ విడతలో 4,056 పొదుపు సంఘాలలోని 40,635 మందికి 30.86కోట్ల రూపాయలు నేరుగా పొదుపు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
👉 కోవిడ్ నేపథ్యంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
👉 మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇస్తూ, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మహిళలు అందరూ అండగా నిలవాలి.