శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు

Spread the love

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంపై చెప్పు చూపించి మాట్లాడడంతోనే బాల్క సుమన్ సంస్కారమేంటో అర్థమైందని ఫైర్ అయ్యారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. నాయకులు ఎజాస్, తౌఫిక్, కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శశికాంత్, మహబూబ్ హుస్సేన్, సర్తాజ్, మల్లికార్జున్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page