SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ఉపాధ్యాయులుగా విద్యార్థిని విద్యార్థులు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు, కలెక్టర్‌, డీఈవో, ఎంఈవోలుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలను చక్కగా బోధించారు. కలెక్టర్‌గా శివ, డీఈవోగా లహరి, ఎంఈవోగా విష్ణు. ఎమ్మెల్యే కావ్య, పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. అలాగే పాఠశాల హెచ్‌ఎంగా ఐశ్వర్యతో పాటు ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. హెచ్‌ఎం డి.పాపయ్య విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కోటిరెడ్డి, సాలెహబేగం, కిరణ్ కుమార్, వసంత, మంజుల, రాధిక,కరుణాకర్ రెడ్డి, హబీబ్, సుభాషిని, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app