ఆక్స్ ఫర్డ్ స్కూల్ కు మూడోసారి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు

Spread the love

School Excellence Award for the third time for Oxford School

ఆక్స్ ఫర్డ్ స్కూల్ కు మూడోసారి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నగరంలోని ఆక్స్ ఫర్డ్ స్కూల్ మూడోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. బ్రైన్ ఫీడ్ సంస్థ ప్రతి యేటా వివిధ కేటగిరిలలో ఉత్తమ విద్యను బోధించే పాఠశాలలను ఎంపిక చేసి ఈ అవార్డు లు ప్రధానం చేస్తుంటుంది. ఆ క్రమంలో 2022 – 2023 విద్యా సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 500 పాఠశాలలను గుర్తించారు.

తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ టెక్నో స్మార్ట్ స్కూల్ కేటగిరి కింద “స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు” కొరకు ఆక్స్ ఫర్డ్ స్కూల్ ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో జరిగిన 10 నేషనల్ కాన్ఫరెన్స్ లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆక్స్ ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మహ్మద్ జాఫర్ మతీన్, వైస్ ప్రిన్సిపాల్ సిద్దిఖా మతీన్ హాజరై అవార్డు అందుకున్నారు. తమ పాఠశాల కు జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు

Related Posts

You cannot copy content of this page