SAKSHITHA NEWS

వరద బాధిత విద్యార్ధికి యస్.బి.ఐ.టి. ఆప్పన్న హస్తం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఇటీవల ఖమ్మం ను ముంచెత్తిన వరదలలో నాయకన్ గూడెం దగ్గర ప్రవాహంలో చిక్కుకొని తల్లి దండ్రులను కోల్పోయిన తమ కళాశాల సెకెండ్ ఇయర్ సి.యస్.సి. విద్యార్థి షేక్ షరీఫ్ కు అండగా ఉంటామని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.

యస్.బి.ఐ.టి. కళాశాలలో చదివే విద్యార్థుల తండ్రి ఒకవేళ ఆకస్మిక మరణం చెందినట్లయితే వారు తమ విద్యను అర్ధాంతరంగా ఆపివేయకుండా కొనసాగించటానికి నేషనల్ ఇన్యూరెన్స్ వారి సహకారంతో 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందచేస్తారని, దీనిలో భాగంగా విద్యార్థి షరీఫ్కు ఆర్ధిక సహాయం కలుగుతుందని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రకృతి విపత్తులో తండ్రి షేక్ యాకూబ్, తల్లి సైదాభి ని కోల్పోవటం పట్ల షరీఫ్ మరియు వారి కుటుంబ సభ్యులకు వారు సానుభూతిని తెలియచేసారు.

తమ కళాశాలలో తండ్రి లేదా తల్లి దండ్రులు ఇద్దరూ లేని విద్యార్థులను గుర్తించి వారి ఫీజులలో కొంత మాఫీ చేయటానికి యాజమాన్యం తీర్మానించిందని ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా జి. ధాత్రి తెలిపారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం తండ్రి లేని విద్యార్థులకు ఎంతో ఆసరాగా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ డా జి. రాజ్ కుమార్ తెలిపారు. విద్యార్థి షరీఫ్ కు ముందు ముందు కూడా తమ కళాశాల అండగా నిలుస్తుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా జె. రవీంద్రబాబు, డా యస్. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS