SAKSHITHA NEWS

ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ ను అరెస్ట్ చెయ్యాలి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సంక్రాంతి రోజు ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ దేశ స్వాతంత్య్రం పై చేసిన వాక్యాలను నిరసిస్తూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్, బీజేపీ నాయకత్వం వారు తరుచుగా రాజ్యాంగంపై,అంబేద్కర్ పై,ఇప్పుడు ఈ దేశ స్వాతంత్య్రం పై వక్రీకరిస్తూ మాట్లాడటం వారికి ఈ దేశ స్వాతంత్య్రం పై ఉన్న ద్వేషాన్ని నిరూపిస్తుందని,గతంలో కూడా జాతీయ పతకాన్ని ఎగురవెయ్యకుండా అవమానించారని ,మళ్ళీ ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని దీనివెనుకాల పైకి హిందూ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నారే తప్ప వారి అసలు ఉద్దేశ్యం మను సిద్ధాంతాన్ని ఈ దేశంలో అమలు చెయ్యడేమేనని అన్నారు. బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ గతంలో హిందూ అనే పదాన్ని వాడేదని కానీ నేడు సనాతన లేక మను ధర్మం అంటున్నారని అంటే వారికి హిందూ అనే పదం కూడా వాడరని ఎందుకంటే వారికి ఆ పదం పైన కూడా అభ్యన్తరకారమేనని అన్నారు.ఇది తెలియకుండా కింది వర్గాల వారైన బహుజనులు, దళితులు, అగ్రవర్ణాలైన రెడ్డి,కమ్మ, కాపు, వెలమ కులాల ప్రజలు కూడా వారికి మద్దతు పలుకుతున్నారని కానీ నిజం తెలియడం కొద్ది రోజుల్లోనే తెలుసుకొని వారిని గద్దె దింపుతారని అన్నారు. స్వాతంత్య్రం అంటే ఒక పరిపాలకులు పోయి మన పరిపాలకులు రావడమని మరి నేడు మోహన్ భగవత్ రాముడిని ప్రతిష్టించాకే స్వాతంత్య్రం వచ్చిందని పలకడం స్వాతంత్ర్తం కోసం అమరులైన భగత్సింగ్,చంద్రశేఖర్,సుభాషచంద్ర బోస్,ఝాన్సీ లక్ష్మీబాయి,శివాజీ మహారాజ్ లాంటి లక్షలాది త్యాగాలను తక్కువ చెయ్యడేమానని అన్నారు.ఆర్ ఎస్ వైస్ స్వాతంత్య్రం పూర్వమే ఆవిర్భావించినప్పటికీ వారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా,బ్రిటిష్ వారు ఇచ్చే ఉద్యోగాలు తీసుకొని బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర తప్ప వారికి స్వాతంత్ర్య సమరయోధులు లేరు ,ఇది ప్రజలకు తెలిసి చైతన్యవంతులైతే తమ మనుగడకు ప్రమాదమని గ్రహించి చిత్పన్న బ్రాహ్మణులు చేస్తున్న కుట్ర కాబట్టి బ్రాహ్మణ కుట్రలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.
మరోసారి స్వాతంత్య్రం పై వక్రీకరించి మాట్లాడకుండా చెయ్యాలంటే మోహన్ భగవత్ ను వెంటనే అరెస్టు చెయ్యాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు హరినాథ్, సహాయ కార్యదర్శి దుర్గయ్య,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,ఉపాధ్యక్షుడు రాములు,శాఖ కార్యదర్శులు సహదేవరెడ్డి,వెంకటేష్,నాయకులు ఇమామ్,సోమన్న,సామెల్,బాబు,అయోధ్య,యాదగిరి,ఆశప్ప, జంబూ లు తదితరులు పాల్గొన్నారు.