SAKSHITHA NEWS

శాంతి దీక్షకు మద్దతు గా పలువురు సీనియర్ పాత్రికేయులు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమాలను విడతలవారిగా కొనసాగిస్తామని పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవనం ఏర్పాటు ప్రక్రియ వెంటనే చేపట్టాలని, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టు లు తెలిపారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్ధానిక వాణిజ్య భవన్ సెంటర్ లో నిర్వహించిన శాంతిదీక్ష కార్యక్రమానికి మద్దతును ఇచ్చి సంఘీభావం ప్రకటించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించిన సంగతి పాలకులు మరచిపోవద్దని అన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టు లను విస్మరించి పాలకులు మాత్రం లబ్ది పొందుతున్నారని అన్నారు. జర్నలిస్టు లకు కనీస వేతనాలు, కొత్త వారికి అక్రిడేషన్ లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్కుంగ్ జర్నలిస్టులు అందరికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇంటి స్ధలాలు ఇచ్చి, పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వాలని తెలిపారు. జర్నలిస్టు భవనాలు లేకపోవడం వలన ప్రస్తుతం జర్నలిస్టులు రోడ్ల మీద గడిపే దయనీయమైన పరిస్థితి దాపురించిందని అన్నారు.

అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంకా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. యూనియన్ లకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేపడతామని అన్నారు. తమ పిలుపును అందుకుని యూనియన్ లకు అతీతంగా వచ్చి శాంతి దీక్షకు మద్దతు ఇచ్చిన జర్నలిస్టులు అందరికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గుండా శ్రీనివాస్ గుప్త, బంటు కృష్ణ, బూపతి రాములు, వేణుమాధవ్,పి. సైదిరెడ్డి, తొలిదశ ఉద్యమకారులు బొమ్మడి లక్ష్మినారాయణ,బచ్చు పురుషోత్తం, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, కొండా శ్రీనివాస్, మల్లికార్జున్, పల్లె మణిబాబు, కొండ్లె క్ర్రష్ణయ్య, జలగం మల్లేష్,గట్టు అశోక్, క్యూ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్, ఉయ్యాల నర్సయ్య, మామిడి రవి దేవరగట్ల సతీష్, మామిడి శ్రవణ్, జహీర్, వాసా చంద్రశేఖర్, సోమా సుమన్,పాషా, పడిసిరి వెంకట్, వల్దాస్ శంకర్, అహ్మద్ లతో పాటు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మహ్మద్ గౌసుద్దిన్, దుర్గం బాలు, చిరంజీవి, వెంకట్, సాయి కృష్ణ , మధుసూధన్ , శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు