సర్వజ్ఞ స్కూల్ వెజిటెబుల్స్ డే

Spread the love
Sarvajna School Vegetables Day

సర్వజ్ఞ స్కూల్ వెజిటెబుల్స్ డే


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

స్థానిక వి.డి.వోస్ కాలనీలో గల సర్వజ్ఞ స్కూల్ నందు వెజిటెబుల్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల కూరగాయల వేషధారణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రకాల కూరగాయలతో వివిధ రకాల ఆకృతులను ప్రదర్శించి, ఆయా కూరగాయల గురించి తెలిపారు. వెజిటెబుల్స్ డే అనేది కూరగాయలనే తినేలా చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారంలో వాటి వైవిధ్యం మరియు ఆవశ్యకతపై అవగాహన కల్పించడం కోసం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ ఆర్. నీలిమా మాట్లాడుతూ వెజిటెబుల్స్ యొక్క ప్రాముఖ్యతను వాటి వలన కలిగే లాభాలను మరియు వాటిలో ఉండే పోషక విలువలను వివరించారు.

ప్రతి రోజు వివిధ రకాల కూరగాయలను తినడం వల్ల అనారోగ్యానికి గురికారు మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. వివిధ రకాల కూరగాయలను తినడంవల్ల పిల్లలకు కావాల్సిన పోషకాలు అందుతాయని వారికి శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి అని చెప్పారు. చిన్నప్పటి నుంచే అన్ని రకాల కూరగాయలు తినడం అలవరుచుకోవాలని సూచించారు

.

ఈ కార్యక్రమంలో డైరక్టర్ నాగేంద్రకుమార్, డైరక్టస్ నీలిమా, ప్రిన్సిపాల్స్, అధ్యాపక మరియు
అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page