మహిళ కమిటీ వారి ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీ

Spread the love

Sankranti Muggle Competition organized under the auspices of the Women’s Committee

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని రైతు బజార్ వద్ద ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళ కమిటీ వారి ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముగ్గుల ను తిలకించి ,మహిళ సోదరీమణులను అభినదించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్రాంతి సంబురాలలో మహిళ సోదరీమణులు భాగస్వాములు కావడం అభినందనీయం అని, మన సంస్కృతీ సంప్రదాయాలను ,సంక్రాంతి పండుగ విశిష్టత ను నేటి తరం వారికి తెలియచేయడం ఈ ముగ్గుల పోటీ ప్రత్యేకత అని ,దీనిని నిర్వహించిన బీఆర్ ఎస్ పార్టీ మహిళ కమిటీ సభ్యులు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

సంక్రాంతి వాతావరణం ముందే వచ్చినట్టు కనిపిస్తుందని , సంక్రాంతి పండుగను ప్రతిబిబించేలా ఈ ముగ్గులు ఎంతగానో గొప్పగా వర్ణించారు అని, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం తో కూడిన ముగ్గును మరియు బీఆర్ఎస్ పార్టీ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి అని వాటి ని వేసిన వారిని ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.

అదేవిధంగా చూడ చక్కని ముగ్గులు వేయడం చాలా గొప్ప విషయం అని, ఈ సందర్బంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వ విప్ గాంధీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ మహిళ కమిటీ సభ్యులను ప్రభుత్వ విప్ గాంధీ , కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, షౌకత్ ఆలీ మున్నా,వాసుదేవ రావు, భాస్కర్ రెడ్డి,నాగేశ్వరరావు, యాదగిరి, మోజస్, జానయ్య, భిక్షపతి, సాయిగౌడ్, మల్లేష్,, చాగంటి అశోక్, వలి, ఇస్మాయిల్,డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మంజుల, శిరీష సత్తూర్, స్వప్న, లక్ష్మమ్మ, షేక్ బిబీ, పుట్టం దేవి, స్వరూపా, రేణుక, సురేఖ, వరలక్ష్మి, లావణ్య, సౌందర్య, లక్ష్మీ, కృష్ణవేణి, పద్మ, నిర్మలమ్మ ఆర్.పిలు, సమాఖ్య లీడర్స్ డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page