SAKSHITHA NEWS

సంగం డైరీ లో నూతన ఉత్పత్తులు పసుపు పొడి- 50gm , గుంటూరు స్పైసీ చిల్లీ పౌడర్ – 50gm ,100gm సాంబార్ పౌడర్- 8gm ,50gm , గరం మసాలా పొడి- 8gm, 50gm మరియు చికెన్ మసాలా-8gm పోలీ ప్యాక్ ల ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సంగం డైరీ ఆంధ్రప్రదేశ్ లో 5796 గ్రామములలో విస్తరించి 1,50,000 మంది పాడి రైతుల నుండి సంగం డైరీ రోజువారీ ప్రాతిపాధికన నేరుగా రోజువారీ సరాసరి 7 లక్షల 80 వేల లీటర్ల మేరకు పాల సేకరణ చేస్తున్నది అని అన్నారు.

పూర్తి అధునాతున సాంకేతికతో, ఆటొమెటెడ్ ప్రాసెస్ ప్లాంట్ లో ప్రాసెస్ చేసి వివిధ రకాల పాలు మరియు పాల పదార్దములను తయారీ చేసి, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ సూచించిన పరీక్షల కన్నా 50% ఎక్కువగా పరీక్షలు నిర్వహించి సంపూర్ణ సురక్షితమెన, నాణ్య మైన పాల పదార్దములను గత 47 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని వినియోగధారులకు ఎల్లవేళలా అందించడానికి ప్రాధాన్యాతనిస్థుంది అన్నారు. ఎల్లప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సంగం డైరీ సంగం బ్రాండ్ తో పాలు మరియు పాల ఉత్పత్తులు తో పాటు బేకరీ ఉత్పత్తులు, నంకీన్స్ మరియు, ఉలవచారు వంటి ఇతర ఆహార ఉత్పత్తులు కూడా మార్కెట్ లో కి ప్రవేశపెట్టామని చెప్పారు.
తరువాత సంగం డైరీ లో నూతనంగా భారతదేశ ఆహార భధ్రతా మరియు ప్రమాణాల సంస్థ యొక్క నిర్థేసిత ప్రమాణాలకు అనుకూలంగా సంగం డైరీ వారు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న గ్యాస్ క్రోమోటోగ్రఫీ మరియు హై పర్ఫార్మన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ అధునాతన యంత్రాలను ఆవిష్కరించారు.


ఈ పరికరాల ద్వారా వెన్న మరియు నెయ్యీలోని వంట నూనెలు, జంతు కొవ్వు పదార్ధాల కల్తీలను గుర్తించి తగు చర్యులు తీసుకునుచున్నారు. తద్వారా ఎల్లవేళలా వినియోగదారులకు కల్తీ లేని వెన్న మరియు నెయ్య పదార్ధాలను అందచేయటానికి ఎల్లవేళలా సంగం డైరీ కట్టుబడివున్నదని తెలియచేసారు.
తదుపరి పాలకవర్గ సమావేశము జరిగినది.
పై కార్యక్రమాలలో పాలకవర్గ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 23 at 6.47.11 PM

SAKSHITHA NEWS