భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే కి వినతి సమర్పించిన నాయకులు. కేంద్రంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996వ సంవత్సరం సంక్షేమ బోర్డు చట్టం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2009వ సంవత్సరం నుండి అమలు జరుగుచున్నాయి వైయస్సార్ పార్టీ అధికారంలో వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు జరగడంలేదని ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇసుక బ్యాన్ చేశారు కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ లేబర్ అధికారులు ఇచ్చిన 1214 మేము ఇచ్చిందని సంక్షేమ పథకాలు అమలు కోసం ఏర్పాటుచేసిన బిల్డింగ్ నిర్మాణ దగ్గర వన్ శాతం వసూలు చేసిన పన్ను నిర్మాణ కార్మికుల కుటుంబాలకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వాలు ఏ ఇతర అవసరాలకు వాడకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయవలసిన ప్రభుత్వం అమలు చేయకుండా కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సంక్షేమ బోర్డు 1150 కోట్ల రూపాయలను నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని నిధులను సంక్షేమ బోర్డుకి జమ చేసి రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సంక్షేమ బోర్డు ద్వారానే కార్మికుల సంక్షేమ పథకాల అమలు చేయాలని గతం నుండి పెండింగ్లో ఉన్న క్లైములు పాతవి శాంక్షన్ చేసిన వాటికి నిధులు విడుదల చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేస్తున్న మాదిరిగా పెన్షన్ స్కాలర్షిప్లు ప్రమాద బీమా సహజ మరణాలు వితంతు పెన్షన్, వివాహ కానుక నిర్మాణ కార్మికులకు సైకిళ్ళు గృహ నిర్మాణాలకు లోన్లు పథకాలు అమలు చేయాలని నిర్మాణ కుటుంబాల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ హెల్ప్ బోర్డును పునర్దన చేసి సంక్షేమ పథకాలు యధాతధం చేయాలని కోరుచున్నాము. ప్రధానమైన డిమాండ్స్ :- పెండింగ్ క్లైములు పరిహారము తక్షణమే కార్మికులకు చెల్లించాలి, 2019వ సంవత్సరం పథకాలు నిలుపుదల తేదీ నుండి జరిగిన పెళ్లిళ్లు ప్రసూతి ప్రమాద సహజ మరణాల పరిహారాలు పొందే అవకాశం కల్పించాలి, అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ అమలు చేయాలి, భవన నిర్మాణ కుటుంబాల్లోని పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా మళ్లించిన సంక్షేమ బోర్డును నిధులను సంక్షేమ బోర్డుకు జమ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి, పై డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించి తగిన న్యాయం చేస్తామని తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ డి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి బి శ్రీరాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి. ముని రాజు, జిల్లా కమిటీ సభ్యుడు నారాయణస్వామి, నగర కమిటీ అధ్యక్షులు పి చిన్న, కమిటీ సభ్యులు దాసు తదితరులు పాల్గొన్నారు
భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎమ్మెల్యే కి వినతి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…