ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడు

Spread the love

Republic Day celebration in Khammam district BRS party office

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గణతంత్ర దినోత్సవ సందర్భంగా నాడు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడమైనది.

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26,1950. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్చ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది తెలిపారు. మన దేశంలో ప్రతి పౌరుడూ తన హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు మరియు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు.


ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కిషోర్ , మలిదశ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు , శేషు , పగడాల నరేందర్, ఆఫ్సర్, ఆసిఫ్, మధిర నియోజకవర్గ నాయకులు మీగడ శ్రీనివాస్, బంక మల్లయ్య , జాకీర్, మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page